Tuesday, August 23, 2011

ఎడిపిస్తున్నావా ప్రేమ
ప్రేమలో ఓడిపోయాను అని .........
ఓడింది నేను కాదే పిచ్చి ప్రేమ......
ప్రేమ ఫై నా నమ్మకం.........
ప్రేమ కోసం ప్రాకులాడ ఇన్నాల్లు
ప్రేమ కాదు అది పిచ్చి అని రాజిపడుతున్న .....
కుమిలిన గుండె తో  కృంగిపోతున్న .........

Friday, August 19, 2011

My Dear One.....On ur B'day........

సిరులొలికే నీ నవ్వులు..
 ఆ నింగిన  హరివిల్లులు ...
ప్రేమ కురిసే నీ స్నేహం ....
ఇలకు జారు చిరువర్షం ...
ముత్యమంటి  ఓ మనసా...
జన్మించావు నేడే  కదా ...
మెరిసే ముత్యమా..
 ఓ నవ  నవ్యమా...
ఇవే నా ఆకాంక్షలు ...
  నీ జన్మదినాన నా శుభాకాంక్షలు .....
 

An Unknown LOVE.....

 పరిచయమెరుగని ప్రేమలు ఎన్నో...
 మనసు దాటని భావాలెన్నో...
 నేలజారు ఈ  కన్నీరు ....
   పలికేనా  నా మనోవ్యధ...
    వెలుగు చీకటి అయిన  వీడలేకున్న....
 పగలు రేయిని  పోల్చలేకున్న...
 నువ్వు దూరమయ్యే కొద్దీ....
 దారుణం నా జీవితం ....
 విధి అని సరిపడినా...
 వికలం నా హృదయం ....
 నువ్వు రావని తెలిసినా ....
  నమ్మదు  నా నయనం ......

 

Thursday, August 18, 2011

samajam.....

మార్పు రాని మనుషుల్లో...
చేతగాని వ్యవస్థలో....
కాగితాల కట్టలుగా మిగిలిపోయె చరిత్ర...
మట్టిలోన కలిసిపోయె మనిషికున్న ప్రతిష్ట .
 సిగ్గులేని సమాజంలో   ......
  అగ్గివెలుగు ప్రభంజనం ..... 
 సృష్టించే శక్తి  నువ్వు....
 తిరగబడే తెగువ నువ్వు....

Wednesday, August 10, 2011

i am lost.................

pranamga preminchanu............
sneham naku chalannavu......
asalane aarpestunna............
anubhandalani anichestunna................

Saturday, August 6, 2011

కాలం


చెరగని జ్ఞాపకాలు సాక్షం
           కాలం మాన్పును గాయాలు 
           కాలం తుడుచును కన్నీళ్లు 
           కాలం మార్చును గమ్యాలు 
           కాలం చేయును చిత్రాలు ......
                                             విచిత్రాలు....
మనిషికి తెలియని మాయే ఈ కాలం 
           మార్పుకి మారు పేరు కాలం  
            కాలం కష్టాలకి సాక్షి 
            ఆనందాలకి అద్దం ఈ కాలం 
            కాలం ఆగదు నీ కోసం 
            కాలం ఆగదు నా కోసం ...
                       అయినా ఆగని పయనం  ఈ కాలం........  

Friday, August 5, 2011

నిత్యసత్యం

రాజులు తరాజులైన....
                           యుగాలు మారినా.....
                           తరాలు తరిగిన....
రక్తపు రాతలు చెరగావులే......
                          చేతిగీతలు మారవులే.....