చెరగని జ్ఞాపకాలు సాక్షం
కాలం మాన్పును గాయాలు
కాలం తుడుచును కన్నీళ్లు
కాలం మార్చును గమ్యాలు
కాలం చేయును చిత్రాలు ......
విచిత్రాలు....
మనిషికి తెలియని మాయే ఈ కాలం
మార్పుకి మారు పేరు కాలం
కాలం కష్టాలకి సాక్షి
ఆనందాలకి అద్దం ఈ కాలం
కాలం ఆగదు నీ కోసం
కాలం ఆగదు నా కోసం ...
అయినా ఆగని పయనం ఈ కాలం........
No comments:
Post a Comment